అమీర్ నగర్ పాఠశాలలో 9వ తరగతికి అనుమతి

నవతెలంగాణ కమ్మర్ పల్లి: కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ పాఠశాలలో 9వ తరగతిని అప్ గ్రేడ్ చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదవ తరగతికి అనుమతి లభించక అయోమయంలో తొమ్మిదవ తరగతి క్లాసులు కొనసాగిస్తూన్నారు. ఆందోళనలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, అమీర్ నగర్ గ్రామాభివృద్ధి కమిటీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికితసుకువచ్చారు. ఆయన రాష్ట్ర ప్రాథమిక పాఠశాల విద్యా కమిషనర్ తో మాట్లాడి అప్ గ్రెడేషన్ కు కావాల్సిన అనుమతులను ఇప్పించారు. ఈ మేరకు అమీర్ నగర్ పాఠశాలలో 9వ తరగతి అనుమతిస్తూ పాఠశాల విద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలో 9వ తరగతి కొనసాగేందుకు అనుమతి విషయంలో కృషి చేసిన సునీల్ కుమార్ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ధన్యవాదాలు తెలిపారు.