నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, డిప్లొమా మొదలగు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో చూడాలని సూచించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. ముందు చేరినా, సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగస్టు18 లోపు ట్యూషన్ ఫీజును చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.