నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా లోని ప్రభుత్వ ఐ.టి. ఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ) ఆలేరు 6వ విడత/వాక్-ఇన్-అడ్మిషన్ల కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ లలో కలిగి ఉన్న సీట్లను తాజా మరియు ఇప్పటి వరకు సీట్లను కేటాయించబడని అభ్యర్థుల కొరకు అడ్మిషన్స్ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ బి హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి కల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలిసిన అక్టోబర్ 19 లోపు http:// iti.telangana.gov.in వెబ్సైటు లో వివరాలను నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రింటెడ్ కాపీ తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో బౌతికంగా ఆసక్తి కలవారు ప్రభుత్వ ఐ.టి. ఐ [పారిశ్రామిక శిక్షణ సంస్థ] ఆలేరు రోజు వారీగా వాక్ ఇన్ అడ్మిషన్స్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. కోర్సుల వివరాలు మాను్ఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, 40 సీట్స్,1 సంవత్సరం,10 వ తరగతి అర్హత , ఇండస్ట్రియల్ రోబోటిక్ & డిజిటల్ మాను్ఫాక్చరింగ్ టెక్నీషియన్ ,40 సీట్స్,1 సంవత్సరం,10 వ తరగతి అర్హత, ఆర్టిసన్ యూసింగ్ అడ్వాన్సడ్ టూల్ 20 సీట్స్ 1 సంవత్సరం 10 వ తరగతి అర్హత, బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫియర్ [మెకానికల్] 24 సీట్స్,2 సంవత్సరాలు,10 వ తరగతి అర్హత , అడ్వాన్సడ్ సి.న్.సి మెషినింగ్ టెక్నీషియన్,24 సీట్స్ 2 సంవత్సరాలు,10 వ తరగతి, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్,24 సీట్స్,2 సంవత్సరాలు 10 వ తరగతి అర్హత ఉండాలని, పూర్తి వివరాలకు బి హరిక్రిష్ణ ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ 9866843920 ని సంప్రదించాలని కోరారు.