నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ మైనారిటి గురుకుల పాఠశాల / కళాశాల డిచ్ పల్లి లో 5వ తరగతిలో మైనారిటికి 60 సీట్లు నాన్ మైనారిటీ లకు 20 సీట్లలకు అడ్మిషన్ ప్రారంభమైనయని గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ అర్సి ఇక్బాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,7,8 తరగతులకు బ్యాక్ లాగ్ అడ్మిషన్లు జరుగుతున్న యని, ఇంటర్ మొదటి సంవత్సరానికి ఎంపీసీ, బిపిఎల్ గ్రూపులలో మైనారిటిలకు ఈ 60 సీట్లు, నాన్ మైనారిటిలకు 20 సీట్లు కేటాయించబడిందని ప్రిన్సిపాల్ అర్సి ఇక్బాల్, ఉపాధ్యాయుడు రవికుమార్ తెలిపారు . అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.