నవతెలంగాణ-తిరుమలగిరి
మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఅర్‌ఎస్ చేస్తున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తుంగతుర్తి అభివద్ధి ప్రదాత గాదరి కిషోర్‌కుమార్ సమక్షంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి,ఎంపీపీ దర్శనాల అంజయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కిశోర్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీరాముల అయోధ్య, పీఏసీఎస్ చైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మెన్ చిప్పలపెల్లి మహేంద్రనాధ్,మాజీ ఎంపీటీసీ పూలపెల్లి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.