నవతెలంగాణ – ఆర్మూర్
ప్రభుత్వం పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, 6 నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడినట్టు పట్టణ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్ శనివారం తెలిపారు. గత నెల ఆరవ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమైనట్టు ఈనెల 28 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, హాల్ టికెట్లను ఏప్రిల్ 3న డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పదవ తరగతి చదువుతున్న రతన్వీర్, అనీష్ విద్యార్థులు రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలలో ప్రతిభ కనబరిచినట్టు, రశ్మిత, రాజేశ్వరి అనే విద్యార్థినిలు సైతం రాష్ట్రస్థాయిలో నాలుగు, ఐదు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.