ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీజీ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ జగ్రామ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంఎస్సి బోటనీలో 24 సీట్లు, ఎంఎస్సి జులాజిలో ఒక సీటు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. సీటు పొందలనుకునే విద్యార్థులు సీపీజీఈటి లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. డిగ్రీ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. స్పాట్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ రాదని, అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూ.2100, ట్యూషన్ ఫీజు రూ.35800 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ డిగ్రీ మేమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్ తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.