అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి కేటాయించాలి

  • తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్

నవతెలంగాణ తుంగతుర్తి: 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం, 2014 నుండి 2023 డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా పనిచేసిన అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వాలి. ఈ మేరకు ఆ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ యువజన విభాగం నాయకులు చింతకుంట్ల రంజిత్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన నాయకులు, చివరి క్షణంలో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసి పార్టీ పట్ల తన నిబద్ధతను చూపించిన నాయకుడు దయాకర్ అన్నారు.
2004 నుండి తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కోదండరాంతో కలిసి జేఏసీ ద్వారా ప్రతి గ్రామాన్ని తిరిగి ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నాయకుడు, ఉన్నత విద్యావంతుడు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ అయిన అద్దంకి దయాకర్ కు తదుపరి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పోతరాజు సురేష్, పోలెపాక సుదర్శన్, కాసర్ల వెంకటేష్, బాలే బాచి, కొమ్మరబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు.