8 భారతీయ భాషలలో ఫీచర్ అప్‌డేట్‌లను విడుదల చేసిన అడోబీ ఎక్స్‌ప్రెస్

నవతెలంగాణ హైదరాబాద్- నేడు అడోబీ (Adobe) (Nasdaq: ADBE) తన ఆల్ ఇన్ వన్ కంటెంట్ క్రియేషన్ యాప్ Adobe Expressకు ఉత్తేజకరమైన భారతీయ భాషకు సంబంధించిన అప్‌డేట్లను ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులు మరియు వ్యాపారాలకు అనుగుణంగా తమకు కావలసిన  ప్రత్యేక డిజైన్‌లు చేసుకునేందుకు ఇది ప్రోత్సహిస్తుంది. డెస్క్‌టాప్ వెబ్ మరియు మొబైల్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ కోసం అందుబాటులోకి ఉన్న ఇంటర్‌ఫేస్ ఇప్పుడు హిందీ, తమిళం మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉండగా, వినియోగదారులు తమ మాతృ భాషలో ఫీచర్లను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటింద. స్థానిక కంటెంట్‌ను సృష్టించడాన్ని ప్రారంభించే లక్ష్యంతో, డెస్క్‌టాప్ వెబ్ కోసం అడోబ్ ఎక్స్‌ప్రెస్‌లోని అనువాద ఫీచర్ ఇప్పుడు ఎనిమిది భారతీయ భాషలు- హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తమిళం మరియు తెలుగుకు మద్దతు ఇస్తోంది.
దీనితో, భారతదేశంలోని విద్యార్థుల నుంచి కంటెంట్ సృష్టికర్తల వరకు ప్రతి ఒక్కరూ లోకలైజ్ చేసిన వీడియోలు, ఫ్లైయర్‌లు, రెజ్యూమ్‌లు, బ్యానర్‌లు, లోగోలు మరియు మరిన్నింటిని వేగంగా మరియు సులభంగా సృష్టించడం కోసం అడోబీ ఎక్స్‌ప్రెస్ (జెనరేటివ్ ఫిల్ మరియు జెనరేట్ ఇమేజ్ వంటివి)లో అడోబీ ఫైర్‌ఫ్లై పవర్డ్ జెన్ఏఐ ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు.

భారతీయ భాషల్లో జెన్-ఏఐ పవర్డ్ అడోబీ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లను పరిచయం చేస్తోంది

‘‘అడోబీలో, మా శక్తివంతమైన డిజైన్ సాధనాలను మరింత మందికి అందుబాటులో ఉంచేందుకు మేము మా ఉత్పత్తులను నిరంతరం ఆవిష్కరిస్తున్నాము’’ అని అడోబ్ ఎక్స్‌ప్రెస్ మరియు డిజిటల్ మీడియా సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోవింద్ బాలకృష్ణన్ అన్నారు. భారతదేశంలో ఉత్పత్తిని అలవర్చుకుని వినియోగించడం, పలు భారతీయ భాషలలో వినియోగదారు-ఇంటర్‌ఫేస్, అనువాద లక్షణాలను పరిచయం చేయడం ద్వారా ఈ విభిన్న మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తున్న కంటెంట్ సృష్టి అవసరాలను రెట్టింపు చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
నేహా డూడుల్స్‌గా గుర్తింపు దక్కించుకున్న కళాకారిణి మరియు సృష్టికర్త నేహా శర్మ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలోని విభిన్నమైన మార్కెట్‌ అనేది కంటెంట్ సృష్టి, సృజనాత్మక వ్యక్తీకరణకు వివిధ భాషలు మరియు ప్రేక్షకుల వరుకు విస్తరించి ఉంది. అడోబ్ ఎక్స్‌ప్రెస్‌ నా స్వాతంత్ర్య దినోత్సవ భాగస్వామ్యానికి సహాయం చేసి గేమ్-ఛేంజర్‌గా నిలిచింది. పలు భారతీయ భాషలలో కళాకృతిని రూపొందించేందుకు, నా కంటెంట్ పరిధిని విస్తృతం చేసేందుకు నేను జెన్ఏఐ- చాలా సరళంగా మరియు వేగంగా వినియోగించుకుంటాను’’ అని వివరించారు.

భారతదేశం కోసం అడోబీ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు

అడోబ్ ఎక్స్‌ప్రెస్‌లోని సరికొత్త స్థానిక భాషా సామర్థ్యాలు వినియోగదారులకు ఉత్పాదక ఏఐ-శక్తితో కూడిన ఫీచర్‌ల శ్రేణికి యాక్సెస్‌ను అందిస్తాయి. ఇది టూల్ ఇంటర్‌ఫేస్‌ను యాక్సెస్ చేసేందుకు, ఎనిమిది భారతీయ భాషల్లో విస్తృత కంటెంట్‌ను సృష్టించేందుకు వారిని అనుమతిస్తుంది. స్థానిక భాషా వినియోగదారులు ఇప్పుడు టూల్‌ను సులభంగా నావిగేట్ చేయగలరు. ఉత్పాదకతను మెరుగుపరుచుకుంటూ, సంబంధిత ఫీచర్లు, టెంప్లేట్‌లను బ్రౌజ్ చేసుకోవడం ద్వారా తమ పనిని త్వరగా పూర్తి చేసుకోగలగుతారు.

  • ఆటో ట్రాన్స్‌లేషన్: మాన్యువల్ అనువాదాలు, బాహ్య సాధనాల అవసరాన్ని తొలగిస్తూ, ఒకే మరియు పలు-పేజీల ఫైల్‌లలో టెక్ట్స్‌ను శ్రమరహితంగా అనువదించవచ్చు. అనువాద ఫీచర్ అనేది ప్రీమియం ఆఫర్ కాగా, ప్రస్తుతానికి ఇది పరిమిత కాలానికి ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో విస్తృతమైన ఆంగ్ల టెంప్లేట్‌లను తమ ప్రాధాన్య భాషల్లోకి అనువదించడం ద్వారా, గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్సెస్‌బిలిటీ, అనుకూలీకరణకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. అనువాద లక్షణాన్ని ఎలా ఉపయోగించాలో here తెలుసుకోండి.

  • స్థానికీకరించిన యుఐ (UI): వినియోగదారు ఇంటర్‌ఫేస్ ఇప్పుడు హిందీ, తమిళం మరియు బెంగాలీలో అందుబాటులో ఉండగా, ఇది మరింత స్పష్టమైన అనుభవాన్ని అందిస్తుంది.

  • టెక్ట్స్-ఎలిమెంట్ అనువాదం: వినియోగదారులు ఏ టెక్ట్స్ ఎలిమెంట్స్ అనువదిస్తున్నారో దాన్ని ఎంపిక చేసుకుని, స్థలాల పేర్లు, బ్రాండ్ల పేర్లు మరియు ఇతర నిర్దిష్ట వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవచ్చు.

  • పలు-పేజీల అనువాదం: ఒకే క్లిక్‌తో పలు పేజీలలో కంటెంట్‌ను అనువదించండి, వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరించండి.

అడోబీ ఎక్స్‌ప్రెస్ గురించి

అడోబీ ఎక్స్‌ప్రెస్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ కంటెంట్ క్రియేషన్ మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్. ప్రత్యేకంగా సోషల్ మీడియా కంటెంట్‌ని సృష్టించేందుకు ఫోటోలు మరియు వీడియోలను ఎడిట్ చేయడాన్ని వేగంగా, సరళంగా చేస్తుంది. ఇప్పుడే కొత్తగా ప్రారంభిస్తున్న వారి నుంచి వృత్తిపరమైన వినియోగదారుల వరకు అందరూ అడోబీ ఎక్స్‌ప్రెస్‌ను దీని కోసం ఉపయోగించుకోవచ్చు:

  • వృత్తిపరంగా రూపొందించిన వేలాది టెంప్లేట్‌లు, అడోబీ స్టాక్ ఫోటోలు, వీడియోలు, సంగీతం మరియు మరిన్నింటితో డిజైన్‌లను వేగంగా పూర్తి చేయడం.

  • వీడియో క్లిప్‌లు, ఆర్ట్‌వర్క్, యానిమేషన్‌లు మరియు సంగీతాన్ని కలపడం ద్వారా వీడియోలను సులభంగా డ్రాగ్ చేయడం మరియు డ్రాప్ చేయడం.

  • అడోబీ ఫైర్‌ఫ్లై జెనరేటివ్ ఏఐతో వివరణ నుంచి తక్షణమే అసాధారణమైన టెక్ట్స్ ఎఫెక్ట్‌లను, ఇమేజ్‌లను రూపొందించడంతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లను ఆబ్జెక్ట్‌లను తొలగించడం, ఇమేజ్‌ని, టెంప్లేట్‌ని రూపొందించడం, ఆడియో నుంచి యానిమేట్ చేయండం, క్యాప్షన్ వీడియో తదితరాలను రూపొందించవచ్చు.

  • టీమ్‌లతో రియల్ టైమ్‌లో ఫైల్స్ రూపొందించడం, వ్యాఖ్య చేసేందుకు అవకాశం ఉంటుంది.

  • లింక్ చేసిన ఫోటోషాప్ మరియు ఇలస్ట్రేటర్ ప్రాపర్టీలను తేలికగా సమకాలీకరించవచ్చు.

అడోబీ ఎక్స్‌ప్రెస్ ఉచిత ప్లాన్ అందుబాటులో ఉంది

వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్‌ల కోసం ఎటువంటి ఖర్చు లేకుండా డౌన్‌లోడ్ చేసుకునే అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ప్లాన్ అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. వినియోగదారులు తమ లోగో, రంగులు మరియు ఫాంట్‌లతో బ్రాండెడ్ కంటెంట్‌ని సృష్టించడానికి అనుమతిస్తుంది. అడోబీ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం most Adobe Creative Cloud plans తో చేర్చారు అలాగే, అడోబ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌లలో యాప్ కొనుగోళ్ల ద్వారా స్టాండ్-ఏలోన్ ప్లాన్‌గా కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.