నవతెలంగాణ – చండూరు
కిషోర బాలికలు రక్తహీనతను నివారించుకోవడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ అధికారి లావణ్య, ఏసీడీపీఓ వెంకటమ్మ, లు అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పుల్లెంల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. బుధవారం వారు హాజరై మాట్లాడుతూ కిషోర బాలికలు రక్తహీనతను నివారించుకునే విదంగా ఆకుకూరలు, పండ్లు, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు.18 సంవత్సరాలు నిండిన తరువాతనే వివాహాలు చేసుకోవాలని, బాల్యవివాహాలు చేసుకోవద్దని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషకాహారాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరలు పండ్లు పిండిపదార్థాలు ఉండేలా చూసుకుంటే ఐరన్ లోపం నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యాదమ్మ లు, అంగన్వాడి టీచర్లు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.