విద్యార్థులకు కౌమారదశ శిక్షణ కార్యక్రమం..

Adolescence training program for students.నవతెలంగాణ – రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట్ మండలంలోని తలమడ్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు కౌమార దశ శిక్షణ కార్యక్రమాన్ని వర్డ్ స్వచ్చంద సంస్థ సిబ్బంది ఎం సి రాణి, సీసీ శ్రీవిద్య, వంశీ, యాదగిరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెరుగుతున్న సమయంలో వచ్చే మార్పుల గురించి, రక్తహీనత, చిన్నారుల రక్షణ చట్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్  పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, భరత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.