– తెలుగు రాష్ట్రాల్లో ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసినట్టు ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ తెలిపింది. హైదరాబాద్‌లో జరిగిన క్లినికల్ సింపోజియంలో ఎర్బా హెచ్7100 ఆవిష్కరించినట్లు పేర్కొంది. క్లినికల్ లాబొరేటరీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి హై-ఎండ్ హెమటాలజీ ఎనలైజర్స్ ఆవశ్యకత’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. దీనికి మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ హెమటోపాథాలజిస్ట్ డాక్టర్ స్వాతి పారు, పలు హాస్పిటళ్లకు చెందిన సీనియర్ డాక్లర్లు సుశీల కోదండపాణి, పరాగ్ పాటిల్, ఫైక్ అహ్మద్, శ్రీకాంత్ పంకంటి తదితరులు హాజరయ్యారు.