నవతెలంగాణ-చండ్రుగొండ
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని గ్రామలలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. తుంగారం పంచాయతీలో వీధులు నారుమళ్లను తలపిస్తున్నాయి. రావికంపాడు పంచాయతీ కార్యాలయం, ఒడ్డు బజారులలో వర్షం నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసాలుగా మారాయి. మండల కేంద్రమైన చండ్రుగొండ బ్రాహ్మణ వీధిలో ఇళ్లలో వాడే డ్రైనేజీ నీళ్లు, వర్షపు నీటితో కలిసి రోడ్డుపై చేరాయి. నిత్యం రాకపోకలు అధికంగా ఉండే ఈ వీధిలో డ్రైనేజీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు మురికి నీటి నిల్వలు తొలగించే విధంగా తర్వాత చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.