ప్రజారోగ్యానికి అధునాతన చికిత్స

– హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ
– ఉస్మానియా ఆస్పత్రి అధునాతన చికిత్సల థియేటర్‌ ప్రారంభం
– సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో మిషన్‌లు ప్రారంభం
నవతెలంగాణ – ధూల్‌పేట్‌
ప్రజా ఆరోగ్యానికి అధునాతన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలోని జీహెచ్‌ఎంసీ బ్లాక్‌ (ఓటీ కాంప్లెక్స్‌) 3వ అంతస్తులో కొత్తగా ఏర్పాటు చేసిన సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆపరేషన్‌ థియేటర్‌, పునరుద్ధరించిన జనరల్‌ సర్జరీ ఓపీ, లింగమార్పిడి క్లినిక్‌ (సౌకర్యం), పెయిన్‌ క్లినిక్‌ (సౌకర్యం)ను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ భారతి హోల్కర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ట్రో సర్జికల్‌లో మరింత అధునాతన చికిత్సలు నిర్వహించేందుకు ఈ థియేటర్‌ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లింగ మార్పిడి, పెయిన్‌ క్లీనిక్‌ అధునాతన చికిత్సలు అందుబాటు లోకి వచ్చాయన్నారు. వైద్యంలో ప్రావీణ్యం, అనుభవం గల వైద్యులు అధునాతన చికిత్సలు అందిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారని అభినందించారు.
ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్న అధునాతన వైద్య చికిత్సలు ప్రజలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళారెడ్డి, అదనపు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.త్రివేణి, ఆర్‌ఎంఓ- 1 డాక్టర్‌ బి.శేషాద్రి, హెచ్‌ఓడి, సర్జికల్‌ జీ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం, డాక్టర్‌ మధుసూధన్‌, హెచ్‌ఓడి ఎండోక్రినాలజీ, డాక్టర్‌ రాకేశ్‌ సహారు, హెచ్‌ఓడి, అనస్థీషియా విభాగం, డాక్టర్‌ పాండునాయక్‌, హెచ్‌ఓడి, జనరల్‌ సర్జరీ విభాగం, డాక్టర్‌ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.