బీఆర్‌ఎస్‌తోనే మునుగోడు అభివద్ధి సాధ్యం

– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌
బీఆర్‌ఎస్‌ పార్టీతోనే మునుగోడు నియోజకవర్గం అభివద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలోని శుభం ఫంక్షన్‌హాల్లో ఆ పార్టీ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుభీమా, గహలక్ష్మీ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ మరెన్నో పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. మునుగోడు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, ఆ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఎమ్‌డి.బాబాషరీఫ్‌, ఆలె నాగరాజు, గ్రంథాలయ ఛైర్మన్‌ ఉడుగు మల్లేశ్‌గౌడ్‌, మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చిరందాసు ధనుంజయ, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్‌, ఢిల్లీ మాధవరెడ్డి, కానుగుల వెంకటయ్య, తొర్పునూరి మల్లేశ్‌గౌడ్‌, వల్లందాసు సతీశ్‌గౌడ్‌, కానుగుల శేఖర్‌, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్ల గణేశ్‌, గోశిక నర్సింహా, రమణగోని రఘు, బొంగు శ్రీకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.