వేములవాడ కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్లో ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులకు, న్యాయవాద కుటుంబాలకు, కోర్టు సిబ్బందికి ఉచితంగా గుండె స్కానింగ్ (టూడీ ఈకో) బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులను ఉచితంగా నిర్వహించారు. మొదటగా వైద్యులు బిపి, షుగర్ టెస్టులు నిర్వహించిన అనంతరం అవసరమగు వారికి మిగతా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఉచిత పరీక్షలను దాదాపు 100 మంది వినియోగించుకున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన ఫార్చ్యూన్ హాస్పిటల్ యాజమాన్యానికి అధ్యక్షులు గుడిసె సదానందం కృతజ్ఞతలు తెలిపారు.