వీరన్న గుట్ట గ్రామంలో తాగునీటి ట్యాంకులను పరిశీలించిన ఏఈ గబ్బర్ సింగ్

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో తాగునీటి ట్యాంకుల నుంచి స్థానిక ప్రజలకు కోడి ఈకలు వచ్చి నీరు కలుషితం అయిందని స్థానిక ప్రజలు ఆరోపించడంతో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గబ్బర్ సింగ్ శనివారం గ్రామాన్ని సందర్శించి ట్యాంకులను పరిశీలించారు. ప్రతి శుక్రవారం పారిశుద్ధ సిబ్బంది వాటిని శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ వేస్తూ ఉండడంతో నీరు స్వచ్ఛందంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రూపాయి కాయిన్స్ వేయగ అది మెరుస్తూ కనబడుతుందని ఆయన పేర్కొన్నారు. తన వెంట గ్రామ కార్యదర్శి రాజు, కారోబార్ బాబా, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.