నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని బాసర మూలమలుపు వద్ద ఇరిగేషన్ కాలువ స్థలంపై నివాసగృహం నిర్మాణంపై ఇరిగేషన్ ఏఈ శ్రీధర్ మంగళవారం విచారణ చేపట్టారు. వార్డు సభ్యురాలు శోభ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ స్థలాన్ని కొలతలు నిర్వహించారు. గృహ నిర్మాణం ఇరిగేషన్ స్థలంలోనే ఉందని నోటీసు జారీ చేశారు.