రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఈఓ యశస్విని 

Apply for Rythu Insurance: AEO Yashaswiniనవతెలంగాణ – పెద్దవంగర
అర్హులైన రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని పెద్దవంగర ఏఈవో యశస్విని అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 2024 జూన్ 28 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు వయసు గల రైతులు బీమా కు అర్హులని తెలిపారు. వారందరూ రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు బీమా ఫారం నింపి దానితో పాటుగా నూతనంగా వచ్చిన ‌‌పట్టా పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను జత చేసి రైతులు స్వయంగా వెళ్లి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఆగస్టు 5వ తేదీలోగా అందజేయాలన్నారు. మార్పు చేర్పుల కోసం ఇంతకుముందు నమోదు చేసుకున్న రైతులు ఎవరైనా సవరణలు ఉంటే తేదీ 30- 07-2024 లోపు సరి చేసుకోవాలని, ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన, కొత్త నామిని మార్పు కోసం వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు నామిని కి ఇస్తుందని, రైతు బీమా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.