
ఎఈఓ శ్రీనివాస్ సేవలు అభినందనీయమని పలువురు నాయకులు అన్నారు. ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో బుధవారం రోజు బదిలి పై వేళ్తున్న ఎఈఓ శ్రీనివాస్ ను ఆయా పార్టీల నాయకులు, రైతులు ఘనంగా సన్మానించారు. రైతులతో కలిసి మెలిసి ఉండి, సకాలంలో రైతులకు సూచనలు, సలహాలు చెప్పె వారు అని పేర్కొన్నారు. పంట నమోదును పకడ్బందీగా నిర్వహించారన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు బదిలిలు సహజం అని వారు పేర్కొన్నారు. ఎక్కడ పనిచేసిన రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావుల గంగారెడ్డి,మాజీ సర్పంచ్ లు,నిమ్మ పోతన్న,రాములు, ాయకులు దత్తాద్రి , రాజారేడ్డి, రవింధర్ రేడ్డి, సాయంరేడ్డి,నర్సరేడ్డి, తదితరులు పాల్గొన్నారు.