బీపీసీఎల్‌తో ఏథర్‌ ఎనర్జీ ఒప్పందం

బెంగళూరు : దేశంలోనే అతిపెద్ద ఇవి టూ-వీలర్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వీలుగా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)తో ఏథర్‌ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ వ్యూహాత్మక సహకారం ద్వారా ఏథర్‌ ఎనర్జీ భారతదేశం వ్యాప్తంగా 21,000 ఫ్యూయల్‌ స్టేషన్‌లను కలిగిన బీపీసీఎల్‌ విస్తృతమైన నెట్‌వర్క్‌కు అనుబంధంగా ఏథర్‌ పబ్లిక్‌ ఫాస్ట్‌-చార్జింగ్‌ గ్రిడ్‌ను నెలకొల్పేందుకు అవకాశాలను మెరుగుపర్చుకోనున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి బీపీసీఎల్‌ లొకేషన్లలో 100 ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ ఫోకెలా పేర్కొన్నారు.