ఏథర్‌ ఎనర్జీ ఎక్సేంజీ ఆఫర్లు

న్యూఢిల్లీ : ఏథర్‌ ఎనర్జీ తన ద్విచక్ర ఇవిలపై పండుగ సీజన్‌ సందర్బంగా ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఏథర్‌ 450ఎస్‌, 450ఎక్స్‌లను కొనుగోలు చేయడానికి ఇతర వాహనాలను ఎక్సేంజీ చేయడం ద్వారా రూ.40వేల వరకు బెనిఫిట్స్‌ పొందవచ్చని తెలిపింది. ఎక్సేంజీ విలువతో పాటు ఫెస్టివ్‌ బెనిఫిట్‌ కింద రూ.5వేల వరకు, రూ.1500 తగ్గింపు, రూ.6వేల వరకు ఇఎంఐ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. 5.99 వడ్డీ రేటుతో 24 నెలల ఇఎంఐ సదుపాయాన్ని ఎంచుకోవచ్చని పేర్కొంది.