హీరో మోటోతో ఏథర్‌ ఎనర్జీ జట్టు

హీరో మోటోతో ఏథర్‌ ఎనర్జీ జట్టున్యూఢిల్లీ : విద్యుత్‌ వాహనాల తయారీదారు ఏథర్‌ ఎనర్జీ ఇంటర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంలో ఏథర్‌ ఎనర్జీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పాయింట్‌లను, ఏథర్‌ గ్రిడ్స్‌, హీరో మోటోకార్ప్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను సజావుగా ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కంబైన్డ్‌ ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇవి వినియోగదారులకు అసమానమైన, సౌకర్యవంతమైన యాజమాన్య అనుభవాన్ని అందించడంలో దిగ్గజ సంస్థగా మారనున్నట్లు పేర్కొంది.