బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలి..

నవతెలంగాణ – ఆర్మూర్ 
నిజాంసాగర్ కాలువ తెగడం వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోనీ..25 సంవత్సరాలుగా నివాసముంటున్న వీరందరికీ పట్టాలు ఇవ్వాల నీ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్. డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ  సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో  పట్టణ కేంద్రంలోని 18.. వార్డుజర్నలిస్టు కాలనీలో గల తెగిపోయిన నిజాంసాగర్ కాలువను మంగళవారం సందర్శించినారు . డివిజన్ కార్యదర్శి దేవారం.. ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు. ముత్తెన్న. మండలకార్యదర్శి.బి. కిషన్.. పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు.. నరేందర్. ఏఐ పి కె ఎస్. జిల్లా నాయకులు ఆకుల గంగారం.. శేఖర్. శేకర్. పి ఓ డబ్ల్యు లక్ష్మీ తదితరులు మంగళవారం..విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో గల జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి నిజం సాగర్ కాలువ పూర్తిగా గండిపడి తెగిపోవడంతో ఉదయం 3 గంటలకు జల ప్రభావంతో భయభ్రాంతులను సృష్టించింది. ప్రాంతంలోనే పూర్తిస్థాయిలో ఇంటి లోపల వరకు నీళ్లు… ఉసిక మట్టి కొట్టుకురాడం జరిగిందని వారు అన్నారు ..ఇసుక పూర్తిస్థాయిలో ఇంట్లోకి వచ్చిందని అన్నారు అక్కడున్నటువంటి కుటుంబాలు ఏమి చేయాలో తోచకుండానే బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణం పెట్టుకొని బయటికి పరిగెత్తడం జరిగిందని వారు అన్నారు అసలు కాలువకు గండిపడి తెగిపోవడానికి ప్రధానంగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమేనని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు మరోవైపు కాలనీలో ఉదయం 3 గంటల నుండి ప్రవహిస్తున్న నీటిని మళ్లించడానికి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని వారు అన్నారు. సుమారుగా 25 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని మున్సిపాలిటీకి టాక్స్ కడుతూ నివసిస్తున్నారు. ట్యాక్స్ తీసుకోవడమే కానివి మంచి చెరువు చూసే విధానం ప్రభుత్వం వద్ద లేదని.. కేవలం ఓట్లు ఎప్పుడు మాత్రమే మేము గుర్తుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఇంట్లోకి రావడంతో ఇంట్లో ఉన్న సామాన్లు బాసన్లు బియ్యం బట్టలు పూర్తిస్థాయిలో నష్టం జరిగిందని వారు అన్నారు దాచుకున్న డబ్బులు బంగారం ఈ నీళ్ల ప్రమాదంలో కొట్టుకుపోయిందని అన్నారు పూర్తి స్థాయిలో ప్రజాపంత నాయకులు సందర్శించి ప్రతి ఒక్క ఇంటిని చూడడం జరిగిందని కొన్నిచోట్ల గుడిసెలే కొట్టుకుపోయిందని మరికొన్నిచోట్ల గోడలు పగిలి కూలిపోయిందని వారు అన్నారు దిక్కు చూడచని స్థితిలో ఉన్న కుటుంబాలను వారి స్థితిగతులను తెలుసుకోకుండా అధికారులు వచ్చి మీరు ఇక్కడి నుండి అందరూ కాల్ చేయాలని హుకుం జారీ చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు కొనసాగితే కచ్చితంగా ఉద్యమం చేస్తామని వెంటనే నష్టపోయిన వారికి నష్టపరిహారం 20వేల రూపాయలు చెల్లించి వారు నివసిస్తున్న ఇండ్లకు పట్టాలు* ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త మండలల కార్యదర్శి బి.కిషన్ నాయకులు శేఖర్ ఆకుల గంగారాం నరేంధర్ అరవింద్ రవి మోహన్ లతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.