పాశ్చాత్య శక్తులు వెనక్కి తగ్గాలని, ఆఫ్రికన్ దేశాలు తమ స్వంత వ్యవహారాలను నియంత్రించుకోవడానికి అనుమతించాలని దక్షిణాఫ్రికా ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ (ఇఎఫ్‌ఎఫ్) పార్టీ మాజీ సెక్రెటరీ-జనరల్, గాడ్రిచ్ గార్డీ కోరాడు. 2011లో లిబియాలో నాటో జోక్యం ప్రారంభంలో పౌరులను రక్షించడం, దేశాన్ని అణచివేత నుంచి విముక్తి చేయడం లక్ష్యంగా మానవతా మిషన్‌గా ప్రదర్శించబడింది. ఇది దేశాన్ని గందరగోళంలో పడేసింది. పశ్చిమ దేశాలు మాత్రమే లిబియా నుండి బయటకు వెళ్లి లిబియా సమస్యను ఆఫ్రికా, ఆఫ్రికన్ యూనియన్ (ఏయు) ప్రజలకు ప్రత్యేకంగా వదిలివేయగలిగితే లిబియాలో శాంతి, స్థిరమైన అభివద్ధి సాధ్యమవుతుంది అని గార్డీ మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాటో జోక్యంతో లిబియాలో పరిస్థితి మరింత దిగజారిందని, ఇది దేశాన్ని అస్థిరపరిచిందని ఆయన పేర్కొన్నాడు. ఆఫ్రికా సమస్యలు ముఖ్యంగా ఖండంలోని గొప్ప ఖనిజ, సహజ వనరుల కోసం పోటీలో భాగంగా బాహ్య ప్రయోజనాల ద్వారా నడపబడుతున్నాయని గార్డీ చెప్పాడు. ఆఫ్రికాలో కనిపించే ప్రతి సంఘర్షణలో, ఇది ఖనిజ వనరులు మరియు అన్ని ఇతర వనరుల కోసం యుద్ధం చమురు, గ్యాస్, బొగ్గు, బంగారం, యురేనియం ఏదైనా పశ్చిమ దేశాలకు చాలా అవసరం. తద్వారా వారు ప్రయోజనం పొందవచ్చు. అందుకోసం ఆ దేశాలు చేసే అరాచకాలు అనంతం”అని అతను చెప్పాడు. ఆఫ్రికా ఛిన్నాభిన్నంగా ఉన్నంత వరకు ఈ సమస్యలు కొనసాగుతాయని ఆఫ్రికన్ సంఘర్షణలలో పశ్చిమ దేశాలు పదేపదే జోక్యం చేసుకోవటాన్ని విమర్శిస్తూ పాన్-ఆఫ్రికనిస్ట్ ఇఎఫ్‌ఎఫ్ పార్టీ మాజీ సెక్రటరీ జనరల్ హెచ్చరించాడు.
ప్రాంతీయ సంస్థలు, ఖండాలు ఏకం కానంత కాలం, అవి కేవలం దేశాల గ్రామాలుగా ఉన్నంత వరకు పశ్చిమ దేశాలు అలానే కొనసాగిస్తాయి. మనకు ఒక ఆఫ్రికా, ఒక ఆఫ్రికన్ దేశం కాకుండా ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయని గాడ్రిచ్ గార్డీ అన్నాడు. ఒకే కరెన్సీ, సైన్యం, ఆర్థిక వ్యవస్థతో ఖండాన్ని ఒకే ప్రభుత్వం కింద ఏకం చేసే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని గార్డీ ఆఫ్రికన్ యూనియన్‌కి పిలుపునిచ్చాడు. ఆఫ్రికన్ యూనియన్ దీని గురించి ఏదైనా చేయాలి, ఆఫ్రికన్ దేశాలను ఒక సంస్థగా, ఒక ద్రవ్య కరెన్సీగా, ఒక సైన్యంగా , ఒకే ఆర్థిక వ్యవస్థతో ఆఫ్రికా ప్రజల కోసం ఒక ప్రభుత్వంగా ఏకం చేయాలి అని ఆయన ముగించాడు. ఇటువంటి ఆవశ్యకతకు ఉదాహరణగా గార్డీ లిబియాలో ఐరోపా దేశాలు చేసిన ఘోరాలను ఉదాహరించాడు. 2011 జనవరిలో ట్యునీషియా అధ్యక్షుడు జైన్ అల్-అబిదీన్ బెన్ అలీ తన దేశం నుండి పారిపోయాడని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే లిబియాలో అశాంతి మొదలైంది. బెంఘాజీ, డెర్నా మరియు అల్-బైదా వంటి లిబియా నగరాల్లో మొదట నిరసనలు చెలరేగాయి. 2011 ఫిబ్రవరి 17న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1973 తీర్మానాన్ని ఆమోదించింది. లిబియాపై నో-ఫ్లై జోన్‌ను విధించింది. పౌరులను రక్షించడానికి బలప్రయోగానికి అధికారం ఇచ్చింది. ఈ తీర్మానం మార్చి 19న నాటో జోక్యానికి అనుమతించింది. దాని తర్వాత లిబియా సుదీర్ఘమైన, రక్తసిక్తమైన అంతర్యుద్ధంలోకి దిగడం, దేశం ఛిన్నాభిన్నం అవటం జరిగింది.