నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద చౌటుప్పల్ కి చెందిన చింతల రామచంద్ర రెడ్డి రాధమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుమారుడు చింతల యాదిరెడ్డి లక్ష్మమ్మ దంపతుల కుటుంబం 5 తరాల కుటుంబ సభ్యులు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆత్మీయ కలయిక ఘనంగా జరుపుకున్నారు.చింతల రామచంద్రారెడ్డి రాధమ్మ దంపతుల కుటుంబ సభ్యులు 30 సంవత్సరాల తర్వాత 5 తరాల కుటుంబ సభ్యులు ఈరోజు ఆత్మీ కలయిక ఘనంగా చేశారు.మనమల్లు మనవరాలు మునిమనుమలు ముని మనవరాలు అంత కలసి కుటుంబ సభ్యులు సుమారు 150 మంది ఆత్మీయంగా పలకరించుకో వడం జరిగినది.ఉమ్మడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా వేడుకలు జరిపారు.ఈ కార్యక్రమంలో వారి కుమారులు కోడలు లక్ష్మమ్మ మరియు కూతురు మరి అల్లుళ్ళు మన వాళ్ళు మనవరాలు అందరూ ఎంతో సంతోషంగా ఆడి పాడి గడిపారు.