40 ఏండ్లు దాటాక…

After 40 years...40 ఏళ్ల తర్వాత మహిళలు బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్‌, రక్తహీనత, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఈ వ్యాధులన్నీ క్రమంగా శరీరాన్ని బలహీనంగా, నిర్జీవంగా మారుస్తాయి. వీటిని నివారించాలంటే మహిళలు తప్పనిసరిగా ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వీటి కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
గుడ్డు
40 ఏళ్ల తర్వాత ఉడకబెట్టిన గుడ్డు కచ్చితంగా తినాలి. ఈ సూపర్‌ ఫుడ్‌లో ప్రొటీన్‌, విటమిన్‌ డి, బయోటిన్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి.
ఆకుకూరలు
ఐరన్‌, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు పచ్చి ఆకుకూరల నుంచే లభిస్తాయి. ఇది మీ హిమో గ్లోబిన్‌, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్‌ పెంచుతాయి.
పప్పు
మూంగ్‌ దాల్‌, ఉరద్‌ దాల్‌, చనా పప్పులో చాలా పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు ఈ పప్పులతో వండిన వంటకాలను తీసుకోవాలి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఫైబర్‌ను శరీరానికి అందిస్తాయి. దీనివల్ల మలబద్దక సమస్యను నివారించవచ్చు.
పెరుగు, మజ్జిగ
సరైన జీర్ణక్రియ కోసం ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. వీటిలో కాల్షియంతో పాటు ప్రో-బయోటిక్స్‌ ఉంటాయి. ఇది జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియా సంఖ్యను అందిస్తుంది. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.