శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అయితే నడక వల్ల మీరు ఎప్పుడు ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం కూడా ముఖ్యం తిన్న తర్వాత నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
హెల్త్‌లైన్ ప్రకారం, తిన్న తర్వాత నడవడం మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆహారం జీర్ణం కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకూడదు. అలా కాకుండా కొంత సేపు నడవాలి. ఇది పెప్టిక్ అల్సర్స్, మూడ్ స్వింగ్స్, డైవర్టిక్యులర్ డిసీజ్, మలబద్ధకం , కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్-1, టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల నడకను వారి దినచర్యలో చేర్చుకోవాలి.
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి తిన్న తర్వాత దాదాపు 5 నుంచి 10 నిమిషాలు నడవండి. ఇది మీకు బాగా నిద్రపట్టడానికి, మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరచడంలో సహాయపడుతుంది.
నడవడానికి సరైన సమయం గురించి మాట్లాడినట్లయితే, మీరు లంచ్ లేదా డిన్నర్ తర్వాత కాసేపు నడవాలి, కానీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవాలి. ఇది మీ జీవితాంతం మిమ్మల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది.