పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్న ఎస్పీ 

– ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి
– హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి
– సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ మరింతగా పెంచాలి
– నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ  సింధుశర్మ  
నవతెలంగాణ –  కామారెడ్డి
పెండింగ్ లో ఉన్న  గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి డి‌ఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. సోమవారం జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ  జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ  మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని  పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని  సూచించారు.   కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు  పని చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని  అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి ల యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పిస్తూ  ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.  సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు  గంజాయి, జూదం,అక్రమ ఇసుక పి.డి.యస్ రవాణా  లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు.  విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని  గుర్తించి వారికి ఎస్‌పి  అవార్డులు అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో  1.  ఎన్. శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్, 2.  కే చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి ఎస్ హెచ్ ఓ, 3. ఏ. తిరుపయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. 4. సంపత్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్నూర్, 5 . పుష్పరాజ్ యస్ఐ రాజంపేట, 6. సాయికుమార్ యస్ఐ భిక్నూర్ , 7. సుధాకర్ యస్ఐ నిజాంసాగర్ 8. శ్రీనివాస్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, 9. సదయ్య, శ్రీనివాస్, రాములు, రాజ గౌడ్, శ్రావణ్, నరేష్, రవి, స్వామి, శ్యామ్, ఎస్ కె వసి, ఇద్రీస్, శంకర్, దిలీప్ కుమార్, అబ్దుల్ హైమద్, ఎండి నదీమ్ కానిస్టేబుళ్లు,  గోవింద్ హోంగార్డ్ తదితరులకు  ప్రశoష  పత్రాలను అందజేస్తూ అభినందించరు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి , డీఎస్పీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసులు,  డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు