– మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు సేటర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
అధికారం కోల్పోయాక తాడిచెర్ల భూ నిర్వాసితులు గుర్తుకొచ్చారాని,నిర్వాసితులపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.అధికారంలో ఉన్నప్పుడు పెద్ద కొడుకు.అధికారం కోల్పోయాక చిన్నకొడుకు అయ్యాడాని సేటర్లు వేశారు.డేంజర్ జోన్ ప్రజల మీద అధికారం కోల్పోయాక ఎక్కడలేని ప్రేమ వోలకపోస్తున్నట్లుగా పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ చోటా మోటా నాయకులకు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని నిర్వాసితుల బాధలు ఇప్పుడు జెన్కోసిఎండి సందీప్ కుమార్ సుల్తానీయను సామాజిక మాధ్యమాల్లో కలిసినట్లుగా విమర్శించారు నిజంగా నిర్వాసితులపై ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే అప్పుడే పని అయిపోయేదని తెలిపారు.2014 లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించిందని,మంథని నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2017లో ఎమ్మెల్యే హోదాలో రాత్రికి రాత్రే తాడిచెర్ల-కాపురం ప్రజల బ్రతుకుల్లో దుబ్బు పోసి రాత్రికి రాత్రే బొగ్గుగని ప్రారంభోత్సవం చేపించి రెండు గ్రామాల ప్రజలు గని ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటే.అధికార పార్టీ మంథని ఎమ్మెల్యేగా ఉండి వేల మంది పోలీసు బలగాలతో భూ నిర్వాసితులను అడ్డుకుని ఉద్యమాన్ని అణచివేసిన సంగతిని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందారపు చెంద్రయ్య, రావుల అంజయ్య,బూడిద. రాజా సమ్మయ్య, దుర్గ ప్రసాద్,ఇందారపు కుమార్,ఇనుగాల చెంద్రయ్య,తుంగపల్లి సాత్విక్,సమ్మయ్య పాల్గొన్నారు.