మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల కోసం వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యత కూడిన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
మధ్యాహ్న భోజనం కోసం అందించే సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.అనంతరం ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించారు.తరగతి గదులను సందర్శించిన ఎంపీడీవో శ్రీనివాస్ విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.