అనంతారం గురుకుల పాఠశాలలో నేషనల్ సైన్స్ డే

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని ఎస్ ఓ ఈ అనంతారం  గురుకుల పాఠశాల యందు నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా డాక్టర్ కర్లీ గీతాంజలి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్  ఇందిరా ప్రియదర్శిని గౌట్ డిగ్రీ  కాలేజ్ హైదరాబాద్ మిడే అరుణ్ కుమార్, అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మేంబర్ ఆఫ్ ఇక్రిసాట్ వారు హాజరై , మాట్లాడారు.   అవసరం అన్వేషణకు దారి తీస్తుందని,  అరుణ్ కుమార్  మాట్లాడుతూ నేటి విద్యార్థులే భావి భారత శాస్త్రవేత్తలు అవుతారని , మీరు చేసినట్టువంటి ఈ  మోడల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు . గురుకుల ప్రధాన చార్యులు పి వెంకటేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ సివి రామన్  ప్రయోగాలు నేటికీ  నిజ జీవితంలో అనుభవిస్తున్నామనీ, అతడు యువ శాస్త్రవేత్తలకు గాని విద్యార్థులకు ఆదర్శనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏటీపీ మెగా , డి డబ్ల్యూ రజిత , సైన్సు ఉపాధ్యాయులు శ్రీ వాణి, అనురాధ, శ్రీలత, రోసినార,అమ్రిన్, కళ్యాణి, కృష్ణయ్య, శ్రీశైలం లు పాల్గొన్నారు.