మళ్లీ బండ బాదుడు

commercial-gas-cylinder-price-hike– వాణిజ్య గ్యాస్‌పై రూ.25 పెంపు
– న్యూ ఇయర్‌ కానుకంటూ తగ్గించి..ఇపుడు కుమ్ముడు
– హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.2,027
న్యూఢిల్లీ: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా ధరల పెంపుతో .. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రిటైల్‌ ధర రూ. 1,795కి చేరింది. ముంబయిలో సిలిండర్‌ ధర రూ.1,749, చెన్నై, కోల్‌కతాలో వరుసగా రూ.1,960, 1,911కి పెరిగింది. హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.2,027లకు చేరింది.వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. నెలరోజుల వ్యవధిలోనే రూ. 39 పెరిగింది. గతేడాది డిసెంబ ర్‌లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.21 పెంచింది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సిలిండర్‌కు రూ. 39.50 తగ్గించినట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 1న గ్యాస్‌ సిలిండర్‌పై రూ.14 పెంచుతున్నట్టు ప్రకటించింది. శుక్రవారం రూ.25 ను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో జనవరిలో తగ్గిం పును నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచుతూ సరిసమానం చేశా యి.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ (14.2) ధర యథాతథంగానే కొనసా గుతుందని చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిం డర్‌ ధర రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబయిలో రూ.902.50, చెన్నైలో రూ. 918.50గా ఉంది.