ప్రభుత్వ కొలువులు భర్తీ చేయడానికి ప్రకటనలు వస్తు న్నాయి. అవి రకరకాలు, పోలీ సులు, గుమాస్తాలు, అధికారులు, ఉపాధ్యాయులు ఇలా ఎన్నో పోస్టులు అవీ ప్రభుత్వ కార్యాలయాల్లో. నీకేం నీకు ప్రభుత్వ ఉద్యోగముంది, తరువాత పింఛనొస్తుంది నెల నెలా అని అవి తెచ్చుకున్న మిత్రులను, బంధు వులను అంటూనే ఉంటారు చాలామంది. ఒక్కసారి అందులో ఇరుక్కుంటే ఇక జీవితం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం. ఆ నమ్మక మైతే కొద్దిగా మారిందిప్పుడు. పింఛను మాత్రం ఎవరిది వారు కట్టుకోవాలి అందుకే దానికి నూతన పింఛను విధానమన్నారు. ఈ నూతన, వినూతన అన్న పదాలు వింటేనే వాటిలో ఏదో తిరకాసు ఉందని తెలుసుకోవాలి మనం. నూతన ఆర్థిక విధానాలు అన్నారప్పుడు, సామా న్యుడు అసామాన్యుడైపోతాడన్నారు. నిజంగానే అంబాని, అదానీ అలాగే అయ్యారు. అదే నూతనం అన్నమాట.
‘పుట్టినవారు గిట్టక తప్పదు’ అన్నట్టు ఉద్యోగంలో ఎక్కినవారు రిటైర్ కాకతప్పదు. అది సహజం. నలభై ఏండ్ల సేవల తరువాత కొందరు పదవీ విరమణ చేస్తుం టారు. విరమణ వయస్సే కాదు చేరే వయస్సు కూడా ము ఖ్యమైనదే. అయితే అవి ఎప్పుడు? అన్న ప్రశ్నతో పాటు ఇంకా ఎన్నో అనుమానాలు మన మనసుల్లో వస్తుం టాయి. కరోనాలాంటి సమయాల్లో విద్యార్థులు తమ జీవి తంలోని చాలా సమయాన్ని కోల్పోతారు. అప్పుడు ఈ రాజకీయులు దాన్ని అంటే సమయాన్ని బాగా వాడుకుం టారు. అయితే అలాంటి విద్యార్థులకు పేపర్లు లీకవుటై కష్టపడి చదివిన చదువుకు ప్రతిఫలం లేనప్పుడు వాళ్ళకు సహాయపడవలసిందే. అందుకే వయోపరిమితి 46 సంవత్సరాలకు పెంచారు. చాలా మంచి నిర్ణయం కదా. అదీకాక లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈ మంచి నిర్ణయం. ఎలాగైతేనేం యువతకు మంచి జరిగితే అదే పదివేలు. ఇంతచేసీ నలభైయ్యారేళ్ళకు ఉద్యోగమొస్తే రిటైర్ అయ్యేది ఇంకో పదహైదు సంవ త్సరాలకేనని గుర్తు పెట్టుకోవాలి. ఉద్యో గమొస్తే కాని పెళ్ళికాని పరిస్థితుల్లో నలభైయ్యారేళ్ళకు పెళ్ళైతే పరిస్థితేమిటి. పిల్లలు పుట్టి పెద్దగయ్యేది ఎప్పుడు? ఉద్యోగమొచ్చే సమ యానికే పెళ్ళై ఉంటే అది వేరే సంగతి. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నూతన పింఛను విధానంలో వాళ్ళకు మిగిలేదేమీ ఉండదు. అతి తక్కువ పింఛను వస్తుంది. దానికీ ఏమైనా చెయ్యాలి మరి. ఇక్కడ ఎమ్మెల్యేలకు, అక్కడ లోక్‌సభ సభ్యులకు వయో పరిమితి అంటే సభలోకి ఎన్నికై పోవడానికి ఇరవై ఐదేళ్ళు నిండి ఉండాలి. వాళ్ళ పింఛను చూస్తే కూడ మనకు ఆశ్చ ర్యమేస్తుంది. ఉద్యోగులకు కొత్తది కదా మరి వాళ్ళకు పాతదే ఎందుకు?
నలభై ఆరుకు పెంచారు సరే. అసలు ఆ వయస్సు వచ్చేదాకా ఉద్యోగం రాకుండా చేసిందె వ్వరు? ఈ అలసత్వానికి కారణమేమి. మీ మీ కుర్చీలు కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ పోస్టులు, కార్పోరేషన్ పద వులు ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళను మంచి చేసుకొని ముం దుకుపోతుంటారే, మరి అదే ప్రేమ యువతపై, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతపై ఎందుకు ఉండదు? వాళ్ళకు నామమాత్రపు పోస్టులే ఇస్తుంటారు, అవి పెరిగేదే లేదు. ఈ వయోపరిమితి పెంచడమన్నది ఓ కంటితు డుపు చర్యనేకాని మరొకటి కాదని ప్రజలు గ్రహించాలి.
ఇప్పుడైతే ఈ వయస్సు బేధాలు చూస్తున్నారు కాని ఆదిమానవులకు అసలు వయసు గురించిన ఊసే తెలి యదు. కష్టపడ్డమే వాళ్లకు తెలుసు, గురి చూసి జంతు వులను వేటాడే వారే నిజమైన నాయకులప్పుడు. స్త్రీ, పురుషులు అన్న బేధమే లేదప్పుడు. అసలు మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉండేదప్పుడు. ఇంకో విషయమేమిటంటే వేటకు పోయేటప్పుడు వయస్సు, అనుభవం ఎక్కువగా ఉన్నవాళ్ళే ముందుంటారు. పరిమితులేవీ లేకుండా వేటా డి అందరూ తినేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకు మిగిలించు కోవడం తెలిసిందే, విశ్రాంతి తీసుకోవడం తెలిసిందో అప్ప టినుండి పరిమితులు మొదలయ్యాయి. అపరిమితంగా మనుషులు పెరిగారు కాని అదే సమయంలో చెట్లు, జం తువులు, కొండలు తరిగిపోతున్నాయి. పరిమితి లేకుండా సంపాదించడం కూడా మొదలయ్యింది. అప్పటినుండీ మిగతావాటికి పరిమితులేర్పడ్డాయి. ఆశ అపరిమిత మైనప్పుడు ఇలాగే జరిగేది.
రాజకీయాల్లో, పదవులు తీసుకోవడంలో ఈ వయో పరిమితి లేనేలేదన్న విషయం అపరిమితంగా అందరికీ తెలుసు. ఇక్కడ వయోపరిమితి అంటే ఆయు ర్ధాయం లేదా ఆయుష్షు అని తెలుసుకోవాలని మనవి. అలా వయోపరిమితిని పెట్టకుండా ప్రభుత్వాలకు ఐదేండ్ల పరిమితిని ఎందుకు పెట్టారు అధ్యక్షా అని ప్రశ్నవేసినా దానికి సమాధానం రాదు. ఎందుకంటే అది నాయకుల జవాబుదారీతనాన్ని తెలియజేసే పరిమితి. ఇప్పుడు భార తరత్న కూడా ప్రభుత్వాల వయోపరిమితిని నిర్ణయించే అంశాల్లో ఒకటిగా మారింది. బయట నానా మాటలు మాట్లాడి, అవమానపరచి ఇంట్లోకొచ్చి కాళ్ళు మొక్కుతారు కొందరు. ఇదే అసలైన రాజకీయం, రాజకీయ చాతుర్యం. చాణక్యుడు నేర్పించింది ఎంతో కొద్దిగానే తెలుసుకున్నా కొందరు నాయకులు చేసే పనుల ద్వారా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మా ప్రభుత్వానికి పరిమితే లేదు మళ్ళీ మేమే వచ్చేది అని చెప్పినోళ్ళు మళ్ళీ వచ్చారు కాని ప్రతిపక్షంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడూ ఒకాయన అదే మాట చెబుతున్నాడు పైన. ఈసారే కాదు ఇంకెన్నిసార్లైనా మేమే వచ్చేదంటున్నాడు. సారే జహాసె అచ్ఛా మేమేనంటున్నాడు. ఆ అచ్ఛానా కాదా అన్నది ప్రజలు నిర్ణయించాలి. నీవు ఏమేమి చేశావో నీవు చెప్పొచ్చు కాని వాళ్ల కడుపులు నిండినాయా, ధరలెలా ఉన్నాయి, డీజిలెంత, పెట్రోలెంత, గ్యాసెంత పెరిగాయో చూస్తూనే ఉన్నారు. గ్యాస్‌పై గ్యాస్ మాటలు వింటు న్నారు. ఇంకా ఉద్యోగులైతే ఆదాయం పై పన్ను పరిమితి పెంచాడా లేదా అనీ చూస్తారు. కూరగాయలు, నిత్యావస రాలపై జీఎస్టీ ఎలా పెరుగుతోందీ చూస్తున్నారు. చేసిన అప్పులెన్ని, ఎందుకు చేశావు అనీ చూస్తారు. తన మిత్రులకు ఏమేమి ధారబోసిందీ చూస్తూనే ఉన్నారు. మిత్రుల్లాంటి ప్రజలను ఎలా విడగొట్టిందీ చూస్తున్నారు. ఇవన్నీ తన ప్రభుత్వ వయోపరిమితిని నిర్ణయించే పరిమితులు.
జంధ్యాల రఘుబాబు
9849753298