ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి..

Agency system should be abolished.నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెడరేషన్ సూర్యాపేట అధ్యక్షులు కంచుగట్ల నర్సింహా అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ నుండి తెలంగాణ జేఏసి పిలుపు మేరకు చలో హైదరాబాద్ కు బయలుదేరి మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ లో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా  హెచ్ఆర్ఎ, సిఏ లను వర్తింప చేయాలని కోరారు.నేరుగా మార్కెట్ ఆఫీస్ నుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు. మార్కెట్ లో ఖాళీగా ఉన్న పోస్టు లను భర్తీ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు రమణయ్య, గౌరవ అధ్యక్షులు వెంకన్న, కోశాధికారి నామ సైదులు, ఉపాధ్యక్షలు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి చంద్ర శేఖర్,విజయ్, హుస్సేన్, రమేష్, రాములు, సైదులు, వెంకన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.