నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వి ద్యార్థులపై సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మిని స్ట్రేషన్ భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులపై ఇలాంటి సస్పెన్షన్ వేయడం హైద రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తగిన న్యాయం కాదని వారు వ్యాఖ్యానించారు. విద్యార్థి సమస్య లపై ప్రజాస్వామిక పద్ధతిలోనే విద్యార్థి సంఘాల నేతలు పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. శాంతియుత పద్ధతిలోనే విద్యార్థులు ఆందోళన చేసి నప్పటికీ విద్యార్థులను సస్పెన్షన్‌కు గురి చేయడం ఆందోళన కలిగిస్తుందని వారు తెలిపారు. ప్రధా నంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయని వారు ఆరో పించారు. ఒకవైపు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీకు కావడం, మరోవైపు నేషనల్ ఫెలోషిప్ టెస్ట్ నెట్ ఎగ్జామ్ పేపర్ సైతం అంగట్లో సర్కులాగా కనిపిం చడం వీరి వైఫల్యానికి నిదర్శనమని వారు అన్నా రు. ఇలాంటి విద్యార్థి సమస్యలపై పోరాటం చేయ కుండా ఉండడం కోసం విద్యార్థి సంఘ నాయకు లను అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన విద్యార్థి స మస్యలపై పోరాటం వెనక్కి తీసుకోమని వారు యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిపారు. విద్యా ర్థుల సస్పెన్షన్ వరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు.