కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన  ..

Municipal workers' agitation in front of the office..నవతెలంగాణ –  కామారెడ్డి 
వేతనాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ స్పందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.బాలరాజ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు మూడు నెలల వేతనాలు చెల్లించడం లేదని,  2 ఏరియర్స్ ఇవ్వాలని  కమిషనర్ కు విన్నతి పత్రం అందజేశామన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దాదాపు 30 సంవత్సరాలు పైగా సానిటేషన్, నీటి సరఫరా, ఎలక్ట్రిషన్ విభాగాలలో దాదాపు 380 మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్నారన్నారు. గత అక్టోబర్ నెల నుండి డిసెంబర్ వరకు మూడు నెలల వేతనాలు పారిశుధ్య కార్మికులకు  వేతనాలు ఇవ్వకుండా బడ్జెట్ లేదంటున్నారనీ, కార్మికులు అర్ధాకలితో అలమటించిపోతున్నారన్నారు. అయినప్పటికీ సక్రమంగా విధులు నిర్వహిస్తున్న బీద కార్మికులకు పట్ల మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు ఎలాంటి కనికరం చూపడం లేదన్నారు. రెక్కాడితే కానీ డొక్కా నిండని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని, గతంలో  అనేకమార్లు జిల్లా, మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం అన్నారు. బకాయిపడిన వేతనాలు వెంటనే చెల్లించాలని అలాగే మున్సిపల్ లో పనిచేస్తున్న వివిధ రకాల కార్మికులు స్కిల్ నాన్ స్కిల్డ్ కార్మికులకు కూడా వేతనాలు ఒకే విధంగా ఇస్తున్నారన్నారు. అదేవిధంగా గ్రూపుల ద్వారా కాకుండా కార్మికుల అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా చేయాలాన్నారు. అలాగే అందరికీ పని చెప్పే విధంగా ఉండాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. అప్పటికి అధికారుల స్పందించకుంటే లేకుంటే  మెరుపు సమ్మెకు వెళ్తామని ఏఐటీ యూసీగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం 2021 లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 60 అమలు చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర నాయకులు వీఎల్ నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ దశరథ్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్, ఏ ఐ టి యు సి జిల్లా నాయకులు రాజిరెడ్డి, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు జి రాజు, ఆర్ లక్ష్మణ్, కార్మికులు  పాల్గొన్నారు.