హమాలీ కార్మికులు పెంచిన హమాలి రేట్ల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో మిల్లర్లకు హమాలీలకు మధ్య సోమవారం చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2026 వరకు రేట్ ల ఒప్పందం ఖరారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రైస్ మిల్లర్స్ అమాలి మేస్త్రీలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం హమాలీ సంఘం సంఘం అధ్యక్షుడు మందడి అనంతరెడ్డి, ఇడ్లీ రాము మాట్లాడుతూ.. ఈ ఒప్పందం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని 23 రకాల పనులకు సంబంధించిన రెేట్ల ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం గతంలో కంటే 18 శాతం పెంచుకున్నట్లు వివరించారు. ఈ చర్చలో హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు గుండు రామస్వామి సంగం నాయకులు ఏ లింగయ్య , అజ్మీర నరసింహ ,బర్ల నర్సిరెడ్డి ,చందర్రావు, కల్తి నరేష్, కట్టయ్య ,ఎం సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.