మండలంలోని అంజనీ గ్రామ శివారులో శనివారంనాడు మండల వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దీన్ రైతులతో కలసి సొయా పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీడ పురుగుల నుండి పంటలను ఎలా కాపాడుకోవాలో పురుగుల నివారణకు పలు క్రిమి సంహారక మందులను ఎలా పిచికారీ చెయ్యాలో వాటి పైన రైతులకు సలహాలు సూచనలు చేశారు.రైతులకు పంటల పై వస్తున్న క్రిమూల నుండి ఎలా రక్షించాలో అవసరం ఉన్నపుడు మండల రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదిస్తే తగు సలహాలు సూచనలు ఇస్తామని ఆయన అన్నారు.