
మద్నూర్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయ అధికారి రాజు సోమవారం తనిఖీ చేపట్టారు. ఫర్టిలైజర్ షాపులో ఎరువులు, పురుగుల మందులు,అమ్మకాలు జరిపిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ యజమానికి ఆదేశాలు జారీ చేస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమ్మకాలు జరపాలని సూచించారు. షాపు తనిఖీలో దుకాణం యజమాని, పలువురు వ్యవసాయదారులు పాల్గొన్నారు.