పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి..

నవతెలంగాణ – ఖమ్మం: ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి నల్లమడుగు గ్రామంలో మేట్ట పద్ధతిలో సాగుచేసిన వరి పంటను పరిశీలించడం జరిగింది. ఈ పద్ధతిలో సాగు చేయడం వలన సమయం ఆదా అవడమే కాకుండా కూలీల ఖర్చును కూడా సులభంగా తగ్గించవచ్చు.. నారుమడి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ఖర్చు కూడా నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆదా అవ్వడం జరుగుతుంది.ఈ మెట్ట సాగులో కలుపును నివారించడం కోసం వివాయా అనే మందును ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారి చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో DAO భాగ్యలక్ష్మి గారు, ఏఈఓ సంతోష్ ,రైతులు ఎట్టం శంకరయ్య, ఎట్టం లక్ష్మణ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.