తుర్కపల్లి మండలం మండలం మాదాపూర్ రైతు వేదికలో రైతు నేస్తం, రైతు రుణమాఫీ కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఇన్సూరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు వరిలో సుడిదోమ, ఆకుపచ్చ తెగులు, అపరాల సేద్యం గురించి వివరించారు. కొండాపూర్ గ్రామంలో పంట నమోదు ను పరిశీలించారు. రైతులకు వరి పత్తి పంటలకు అవసరమైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డివిజనల్ అధికారి శాంతినిర్మల, మండల వ్యవసాయ అధికారి శ్రీ ఉమా, వ్యవసాయ విస్తరణ అధికారులు పృథ్వి, తిరుమల్ రావు, రాకేష్, దివ్య, ఉమా, జెస్సి, రైతులు పాల్గొన్నారు.