
మండల కేంద్రంలోని బట్టోడ్ బాగ్ శివారులో వరి విత్తనోత్పత్తిలో భాగంగా రైతు సాయిలు నూతనంగా అనుసరిస్తున్న సాగు పద్ధతిని మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. వరి సాగులో నాట్ల సమయంలో చేపట్టవలసిన చర్యల గురించి రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఏ ఈ ఓ లు వినోద్, వసంత్ మరియు రైతులు పాల్గొన్నారు.