వారం రోజులలో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మండల వ్యవసాయ అధి కారి మోహన్ తెలిపారు. బుధవారం మండలం లోని కాన్గల్ గ్రామంలో రెండు లక్షల రుణ మాఫీ కానీ కుటుంబ నిర్దారణ సర్వే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఏపీజీవీబీ, ఎస్బిఐ బ్యాంకుల పరిధిలో 205 మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రైతుల కుటుంబాలను నిర్దారణ చేయ వలసి ఉంద ఇందుకు సంబంధించి సర్వే ప్రారంభిం చమన్నారు. వారం రోజులలో ఈ సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. ఈ రైతులకు రుణ మాఫీ వర్తించేలా కృషి చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.