ఆధునిక పరిశ్రమగా వ్యవసాయం

– ‘లైట్‌ హౌస్‌ కంక్లేవ్‌ ఎఫ్‌పీవో 2023’లో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా తయారు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సాంప్రదాయ వ్యవసాయం నుంచి రైతాంగం బయటకు రావాలని కోరారు. ఆ దిశగా అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరా బాద్‌ కన్హాశాంతివనంలో సమున్నతి సంస్థ నిర్వహించిన ‘లైట్‌ హౌస్‌ కంక్లేవ్‌ ఎఫ్‌ పీ ఓ 2023’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 180కి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో సమున్నతి సంస్థ సీఈవో అనిల్‌ కుమార్‌, డైరెక్టర్‌ ప్రవేశ్‌ శర్మ, డాక్టర్‌ వెంకటేష్‌ తగత్‌, ఏపీఎంఏఎస్‌ సీఈవో సీఎస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.