వ్యవసాయం కళాశాల అనుభవ పూర్వక విద్య…

College of Agriculture Experiential Education...– చదువుతూ సాగు…
– సేంద్రీయ ఎరువులతో యాజమాన్య పద్దతులు…
– విద్యార్ధులు పండించిన కూరగాయలు వసతికి గృహానికి సరఫరా…
– అనుభవం పూర్వ విద్యలో రాణిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు….
– అభినందిస్తున్న ఏడీ హేమంత్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుభవ పూర్వకంగా చేసేపని గాని,చెప్పే మాటకు గానీ ప్రాధాన్యత,ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే విద్యాశాఖ  బోధనలో అనేక సాంకేతిక పరం అయిన నూతన ఒరవడి లను అమలు చేస్తుంది. ఈ క్రమంలో స్థానిక వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం విద్యార్ధులు తాము చదివిన థీరీ నే నమూనా వ్యవసాయం సాగు ప్రయోగిస్తూ ,దిగుబడులు రప్పిస్తూ,వారు పండించిన కూరగాయలు నే వారి వసతి గృహానికి సరఫరా చేస్తూ వారి తర్వాత చదివే విద్యార్ధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం విద్యలో (బీఎస్సీ – ఏజీ ) చివరి సంవత్సరం విద్యార్ధులకు రెండు సెమిస్టర్ లు ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ ఎక్స్పీరెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం( ఏ.ఈ.ఎల్.పీ – వ్యవసాయ అనుభవపూర్వక నేర్పరి కార్యక్రమం,రెండోది గ్రామీణ వ్యవసాయ పని పూర్వక నేర్పరి కార్యక్రమం (ఆర్.ఏ.డబ్ల్యు.ఈ.పీ – రావెప్ – రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అని ఉంటాయి. ప్రస్తుతం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఏ.ఈ.ఎల్.పీ లో సెమిస్టర్ లో సేంద్రీయ ఎరువుల తయారీ,బయో ప్రొడక్ట్స్,కమర్షియల్ వెజిటేబుల్ ప్రొడక్షన్స్,పుట్ట గొడుగులు ఉత్పత్తి,పత్తి సాగు లాంటి కార్యక్రమాలను స్వయానా విద్యార్థులే సాగు చేస్తున్నారు.ఈ పనిలో నిమగ్నం అయిన విద్యార్ధులు సమిష్టి పని విధానం లో సత్ఫలితాలు పొందుతున్నారు. ప్రస్తుతం మన కథనంలో సేంద్రీయ సాగు పద్దతిలో తీగ జాతి రకాలు అయిన స్టార్ కాకర,దోస,‌సొర(ఆనప) కూరగాయలు,పుచ్చ(ఐస్ బాక్స్ వాటర్ మిలాన్ సూపర్ ఫ్రూటీ ) సాగును ఈ యూనిట్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న స్థానిక కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి పర్యవేక్షణలో స్వయానా విద్యార్థులే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ పంట దిగుబడులు ఇస్తున్నాయి.ఈ కూరగాయలను తమ కళాశాల వసతి గృహం వంట అవసరాలకే సరఫరా చేస్తూ సాగులో అవగాహన,ఆర్ధికంగా ఆదాయాన్ని చవిచూస్తున్నారు.
దీంతో అనుభవ పూర్వక విద్యలో రాణిస్తున్న విద్యార్ధులను స్థానిక కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్ అభినందిస్తున్నారు.
రైతు కష్టం అపారం – సిద్దార్ధ, వ్యవసాయ విద్యార్ధి
దుక్కి చేయడం నుండి పంట దిగుబడి వరకు మేమే స్వయంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనులు చేపట్టాం.ప్రతీ అంశంలో స్వీయ అనుభవాన్ని పొందు తున్నాం. ఇలా చేయడంతో రైతు కష్టాన్ని మేమే అనుభవించిన అనుభూతి కలుగుతుంది.
సాగు వ్యయం,ఆదాయం పై వ్యత్యాసాలు తెలుసుకో గలుగుతున్నాం – నేహా పిర్దోషి,వ్యవసాయ విద్యార్ధి
స్వీయ అనుభవం తో సాగు చేస్తున్నాం.ఇందులో సాగు వ్యయం,ఆదాయం వ్యత్యాసాలు తో పాటు యాజమాన్య పద్దతులు అలవర్చుకుంటున్నాం.
అనుభవ పూర్వక విద్యతో సత్ఫలితాలు – ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి  అనుభవ పూర్వక విద్యతో విద్యార్ధులు పరీక్షల్లో సత్ఫలితాలు పొందుతారు.చదువుతూ పనిచేయడం తో క్షేత్రస్థాయిలో రాణిస్తారు.విద్య పూర్తి కాగానే వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది.