అంబేద్కర్ కు నివాళులర్పించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు …

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి  మార్కెట్ కమిటీ చైర్మన్  రేఖ బాబురావు, గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తి , మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి,  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన, పీడిత ప్రజల జీవితాలను మార్చడానికి, తన కుటుంబాన్ని,  తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్  బిఆర్ అంబేద్కర్. కోట్లాది గుడిశల్లో నిరంతరం వెలిగే జ్ఞాన దీపం ఆయన్ని తెలుసుకోవడం మనిషితనం ఆయన్ని ఆచరించడం మనిషిత్వం అని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిట్టల రజిత గారు, మండల జనరల్ సెక్రెటరీ ఎడ్ల శ్రీనివాస్, ముత్తిరెడ్డిగూడెం మాజీ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, స్వాతి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ కొండమడుగు అశోక్, గుంతకండ్ల సురేష్ లు పాల్గొన్నారు.