మొక్క జొన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని శివపూర్ గ్రామంలో బుధవారం నాడు మండల వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దీన్ మొక్క జొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన రైతులకు మొక్క జొన్న పంటలను పండించే విధానం పై అవగాహన కల్పించారు. పంట చెనులో సాధారణం కంటే నీటి నిల్వ ఎక్కువగా ఉండరాదని తేమ శాతం తక్కువగా ఉండలని అన్నారు.నిల్వ ఉన్న నీళ్లను పంట చెనులో నుండి తీసివేసిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా మ్యురేట్ అప్ పోటాష్ 10 కిలోలు బూస్టర్ డోస్ గా వేసుకోవాలని పలు సూచనలు చేశారు.