– సౌదీ స్మాష్ 2024
జెడ్డా (సౌదీ అరేబియా) : సౌదీ స్మాష్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ జోడీలకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖరీ జోడీ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నిరాశపరిచింది. మియు (జపాన్), కిమ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఆసియా క్రీడల కాంస్య పతక విజేతలు 2-3తో ఓటమి చెందారు. 6-11, 11-9, 10-12, 11-6, 11-8తో అహిక, సుతీర్థ పోరాడి ఓడారు. మెన్స్ డబుల్స్ విభాగంలో మనుశ్ షా, మానవ్ ఠాకూర్‌లు స్లోవేకియా, హాంగ్‌కాంగ్ ప్యాడర్ల చేతిలో 18-20, 11-4, 11-6, 9-11, 11-7తో పరాజయం పాలయ్యారు.