డాక్టరేట్ పట్టా అందుకున్న అహ్మద్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపల్ 

Ahmed B.Ed College Principal who received doctorate degreeనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అహ్మద్ కళాశాలలో ప్రిన్సిపల్ లుగా పనిచేస్తున్న హనీఫ్ పాషా జంతు శాస్త్ర విభాగంలో పీహెచీ డాక్టరేట్ పట్టా పొందారు. కామారెడ్డి కి చెందిన హనీఫ్ పాషా సన్రైజ్  విశ్వ విద్యాలయంలో  జంతు శాస్త్ర విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించారు.  “ ఎనలైటికల్ స్టడీ ఆన్  డెవలప్మెంట్ అఫ్ ఫిష్ బయోడైవర్సిటీ  అండ్ హాబిటేట్ ఎకలజీ ” అనే అంశంపై  డాక్టర్ దీపిక వాట్స్  పర్యవేక్షణలో పరిశోధనలు చేసి యూనివర్సిటీలో సమర్పించారు .వాటిని పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు అతనికి పీహెచ్డీ  ప్రధానం చేశారు. తనకు డాక్టరేట్ రావడానికి పూర్తి సహకారం అందించిన యూనివర్సిటీ అధికారులు, కుటుంబ సభ్యులకు, గురువులకు, మిత్రులకు ఎంతో రుణపడి ఉంటానాని హనీఫ్ పాషా తెలిపారు. జంతు శాస్త్ర విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు,కళాశాల సిబ్బంది హనీఫ్ ని అభినందించారు.